Raju's Royal Portrait
పూర్వ కాలంలో ఒక రాజు తన రాజ్యంలో దారికి అడ్డంగా ఒక రాయిని ఉంచి ఏమి జరుగుతుందో రహస్యం చూసి తనకు తెలియచేయమని ఒక భటుని నియమించటం జరిగింది. ఆ దారిన పోయే బాటసారులు అంతా రాజుని తిట్టుకుంటూ పక్క నుంచి నడుచుకుంటూ వెళ్ళటం జరుగుతుంది, కానీ కొంత సేపటి తరువాత ఆ దారిన ఒక రైతు నెత్తిన పెద్ద బరువు తో వెళుతూ, ఆ బరువును పక్కకు పెట్టి అయ్యో రాత్రి పూట చీకటి లో వెళ్ళే వారికి దెబ్బలు తగులుతాయి అని ఆలోచించి ఆ బండ రాయిని కష్టంగా పక్కకు జరపటం జరిగింది. అప్పుడు ఆ బండ రాయి క్రింద అతనికి "రాజు నుంచి కానుక" అని ఒక లేఖ తో పాటు కొన్ని బంగారు నాణాల సంచి దొరకటం జరిగింది. ఈ కథ ద్వారా మనం తెలుసుకోవలసిన నీతి అడ్డం వచ్చిన అవరోధాలను అధిగమించి నపుడు అనుకోని అవకాశాలు కూడా వస్తాయి.

